- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తేనెటీగలు ఎందుకంత భీకర శబ్ధం చేస్తాయో.. మీకు తెలుసా?
దిశ, ఫీచర్స్: తేనెటీగలు చేసే శబ్ధం భీకరంగా ఉంటుంది. అయితే అవి అంత తీవ్రస్థాయిలో ధ్వనులెందుకు చేస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. అయితే వాటిని చంపేందుకు లేదా వాటిపై దాడి చేసేందుకు తేనెటీగల సమీపంలోకి గెయింట్ హార్నెట్స్(కందిరీగలు) వచ్చినప్పుడు.. అందులో నివసించే ఇతర తేనెటీగలు రక్షణ కోసం విలక్షణమైన శబ్ధాలతో వార్నింగ్ సిగ్నల్స్ పంపిస్తుంటాయి. అయితే ఈ సౌండ్‌ను నోటి ద్వారా కాకుండా వాటి పొత్తికడుపుల నుంచి చేస్తుండగా.. రెక్కలను కంపింపజేస్తూ ఎగిరే క్రమంలో వాటి ధ్వనులు మానవ అరుపులా భీకరంగా వినిపిస్తాయి. దీనిని ‘యాంటీ ప్రెడేటర్ పైపు’ లేదా ‘బీ స్క్రీమ్’ అని కూడా పిలుస్తుండగా.. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్‌లో ఈ అధ్యయన విశేషాలు ప్రచురితమయ్యాయి.
గెయింట్ హార్నెట్స్ దండయాత్రలు క్రూరమైనవి కాగా వీటిని ‘మర్డర్ హార్నెట్స్’గా కూడా పిలుస్తారు. తేనెటీగలు, కందిరీగల శరీరాకృతితో పాటు ప్రవర్తనలోనూ పోలికలు ఉంటాయి. కానీ ఈ రెండు కలిస్తే ప్రమాదమే. గెయింట్ హార్నెట్స్ కేవలం కొన్ని గంటల్లో తేనెపట్టులోని మొత్తం తేనెటీగలను నాశనం చేసి, గూడును ఆక్రమించుకోగలవు. అందువల్ల తేనెటీగలు.. కందిరీగలు దాడి చేసేందుకు వచ్చే సమయంలో అలారం కాల్స్ చేస్తుంటాయి. ఈ అరుపులకు ఫియర్, పానిక్‌తో కూడిన శబ్ధ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
తేనెటీగల లోపల మైక్రోఫోన్స్, వెలుపల వీడియో కెమెరాలను అమర్చిన పరిశోధకుల బృందం.. 1,300 నిమిషాలకు పైగా బీహైవ్(తేనెపట్టు) ధ్వనులను సేకరించింది. ఈ రికార్డింగ్స్‌లో దాదాపు 25,000 అకౌస్టిక్ సిగ్నలింగ్స్ ఉండగా.. స్పెక్ట్రోగ్రామ్స్, సౌండ్ ఫ్రీక్వెన్సీల విజువలైజేషన్స్ కూడా పరిశీలించారు. తేనెటీగలన్నీ ఒకేసారి సంకేతాలు ఇస్తుండటం వల్ల శబ్ధ తీవ్రత పెరుగుతుందని తెలిపారు. అయితే అలారం సిగ్నల్ తేనెటీగల ప్రవర్తనను ఎలా మారుస్తుందో శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియలేదు కానీ హార్నెట్స్ దాడి సమయంలో అందులో నివసించే తేనెటీగల కబుర్లు ఎనిమిది రెట్లు పెరుగుతాయని, ‘యాంటీ ప్రెడేటర్ పైప్స్’ నుంచి సిగ్నల్స్ రాగానే తేనెటీగలు వెంటనే బయటకు వచ్చేస్తుంటాయని వివరించారు.
గూళ్ల ప్రవేశమార్గంలో పేడను పూయడం ద్వారా ప్రెడేటర్ కందిరీగల నుంచి రక్షణ పొందుతుండగా, తేనెటీగలు వాడే అద్భుతమైన టెక్నిక్ ఇదేనని తెలిపారు. జంతువుల పేడ మాత్రమే కాకుండా పక్షులు, క్షీరదాల విసర్జాల (poop)ను కూడా సేకరించి తమ గూళ్లకు అప్లయ్ చేస్తున్నాయి. అంతేకాదు కొన్ని తేనెటీగలు హార్నెట్‌ల చుట్టూ ఉక్కిరిబిక్కిరి చేసే బంతిలా ఏర్పడి వాటిని చంపేస్తాయి. తమ నాసోనోవ్ గ్రంధి ద్వారా ఫెరోమోన్స్ కూడా విడుదల చేస్తాయి. కానీ దీని ఉద్దేశ్యం అస్పష్టంగానే ఉంది. ఈ ప్రాథమిక పరిశీలనలు భవిష్యత్ పరిశోధనలకు మార్గం చూపగా.. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఉత్సాహమిచ్చాయని తెలిపారు.