ఆసక్తిగా ‘జెఎల్ 50’ వెబ్ సిరీస్

by  |
ఆసక్తిగా ‘జెఎల్ 50’ వెబ్ సిరీస్
X

దిశ, వెబ్‌డెస్క్ :
సినిమాలను మించిన స్టోరీలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఇప్పటికే ప్రతి వారం ఏదో ఒక ఓటీటీ నుంచి ఓ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. సోనీ లైవ్‌లో ‘జేఎల్ 50’(JL 50) అనే వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 4వ తేదీన విడుదలైంది.

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తీసిన ఈ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలతో పాటు నెటిజన్ల అభిమానాన్ని అందుకుంది. ఇందులో బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అభయ్ డియోల్ లీడ్ రోల్ పోషించాడు. పంకజ్ కపూర్, పియూష్ మిశ్రా, రాజేశ్ శర్మలు కీలక పాత్రలు పోషించారు. రితికా ఆనంద్ మరో ప్రధాన పాత్రలో నటించింది. ఆమెకు ఇదే తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం.

35 సంవత్సరాల క్రితం.. 1984లో ‘జెఎల్ 50’ అనే విమానం క్రాష్ అవుతుంది. ఆ తర్వాత 2019లో ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. సరిగ్గా.. జెఎల్ 50 విమానం క్రాష్ అయిన ప్లేస్‌లోనే ప్రస్తుతం ఈ విమానం కూడా క్రాష్ అవుతుంది. అయితే, అందులో ఇద్దరు మాత్రమే బతికి ఉంటారు. వారిలో ఒకరు జెఎల్ 50 పైలట్ బిహు ఘోష్ ( రితికా ఆనంద్) కాగా, రెండో వ్యక్తి బిస్వజిత్ చంద్ర మిత్ర (పియూష్ మిశ్రా). ఈ క్రమంలో వారిని హాస్పిటల్‌కు తరలిస్తారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ ఆఫీసర్ శంతను ( అభయ్ డియోల్) వారిని ప్రశ్నిస్తాడు. వారిద్దరు కూడా 1984లో ఎలా ఉంటారో.. ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంటారు. వాళ్ల వయసులో ఏమాత్రం మార్పు ఉండదు. ఇది ఎలా సాధ్యం? టైమ్ ట్రావెల్ సాధ్యమేనా? అప్పుడు క్రాష్ అయిన విమానం.. ఇప్పుడు క్రాష్ అయిన విమానం రెండు ఒకటేనా? అసాధ్యం సుసాధ్యమేనా? అన్నది తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఈ వెబ్ సిరీస్ కేవలం 4 ఎపిసోడ్లతో నిర్మితమైంది. అంతేకాదు ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ ప్రతి ఎపిసోడ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. అంతేకాదు, 30 ఏల్ల కిందట కలకత్తా వీధుల అందాలను ఇందులో చూడొచ్చు. దీనికి శైలెందర్ వ్యాస్ దర్శకత్వం వహించారు. వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన రితికా ఆనంద్.. దీనికి నిర్మాతగా వ్యవహరించింది.


Next Story

Most Viewed