ఆగిపోయిన హోండా కార్యకలాపాలు!

by  |
ఆగిపోయిన హోండా కార్యకలాపాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ ఆంక్షల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జపాన్ కార్ల తయారీ కంపెనీ హోండాకు మరో దెబ్బ తగిలింది. సైబర్ ఎటాక్‌తో అంతర్జాతీయంగా పలు కర్మాగారాలను మూసివేస్తున్నట్టు వెల్లడించింది. సైబర్ దాడిని అధిగమించేందుకు ఇండియా, బ్రెజిల్‌లలో హోండా ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇంటర్నల్ సర్వర్ల ద్వారా కంపెనీ సిస్టమ్స్‌లో ఈ వైర్స వ్యాపించినట్టు బుధవారం హోండా కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ సైబర్ అటాక్ కారణంగానే ఇండియా, బ్రెజిల్ దేశాల మోటార్ సైకిల్ ప్లాంట్లను మూసేశామని, టర్కీలోని కార్ల తయారీ ప్లాంట్లలో మాత్రమే బుధవారం నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభమైనట్టు వెల్లడించారు. దీనిపై వివరాలను పరిశీలిస్తున్నామని, అయితే ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొన్నారు. ఈ సైబర్ అటాక్ వల్ల మొత్తం 11 హోండా ప్లాంట్లు ప్రభావితమైనట్టు, ఇందులో అమెరికాలోని 5 ప్లాంట్లు ఉన్నాయని తెలుస్తోంది. సైబర్ దాడి జరిగినప్పటికీ అమెరికాలో కార్యకలాపాలు కొనసాగించారు. ఇప్పటికే, కరోనా సంక్షోభం వల్ల హోండా గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో నికర లాభం 25.3 శాతం క్షీణించినట్టు ప్రకటించింది. అమ్మకాలు కూడా 6 శాతం తగ్గాయని పేర్కొంది.


Next Story

Most Viewed