బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్‌‌పై బయోపిక్

by Shyam |
Saroj-khan-Biopic
X

దిశ, సినిమా : బాలీవుడ్ లేట్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ బయోపిక్‌ ప్రకటన వెలువడింది. గతేడాది గుండెపోటుతో మరణించిన ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్‌ జీవిత కథ ఆధారంగా సినిమాను నిర్మించనున్నట్టు టీ-సిరీస్ సంస్థ, అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ అధినేత భూషణ్ కుమార్ తన స్టేట్‌మెంట్‌లో.. సరోజ్ ఖాన్ స్టోరీకి సంబంధించిన అన్ని హక్కులను ఆమె కుమారులు రాజు ఖాన్, సుఖైనా ఖాన్‌తో పాటు కూతురు హీనా ఖాన్ నుంచి తీసుకున్నట్టు తెలుపుతూ.. ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

కాగా సరోజ్ ఖాన్ చనిపోయిన తర్వాత కొద్దిరోజులకే తన బయోపిక్ తీస్తానని, ఆమె కోరిక కూడా అదేనని కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రెమో డిసౌజా ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా సరోజ్ ఖాన్ బతికున్నప్పుడు ‘ఎవరైనా నా బయోపిక్ తీయాలనుకుంటే నువ్వే చేయాలి, ఎందుకంటే డ్యాన్సర్ల స్ట్రగుల్స్‌తో పాటు డ్యాన్స్ గురించి కూడా నీకు తెలుసు’ అనేదని గతంలో ఓసారి రివీల్ చేశాడు రెమో.

Advertisement

Next Story