పోలీస్ కమిషనర్లతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష

by  |
పోలీస్ కమిషనర్లతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష
X

దిశ, క్రైమ్‌బ్యూరో: బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పోలీసు కమిషనర్లతో గురువారం తన కార్యాలయంలో సమీక్షించారు. అంజనీ కుమార్ (హైదరాబాద్), మహేష్ భగవత్ (రాచకొండ), వీసీ సజ్జనార్ (సైబరాబాద్)లు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేది నుంచి మూడ్రోజుల పాటు నిర్వహించనున్న బక్రీద్ పండగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి చర్చించారు. సమావేశంలో ఆయన మాట్లాడుగూ జంతువులను కొనుగోలు చేసే సందర్భంలో స్థానిక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్‌ను భద్రపరచుకోవాలని ఆయన సూచించారు.

జంతువులను రవాణా చేస్తున్న సమయంలో చట్ట ప్రకారం పోలీసు సిబ్బంది వ్యవహరిస్తారని, గోవులు తప్ప ఇతర జంతువులను పోలీసులు అడ్డుకోరని తెలియజేశారు. ఈద్గాలలో ప్రార్ధనలకు అనుమతి లేనందున మసీదులలో ప్రార్థనలను చేసుకోవాలన్నారు. ఎవరి ఇంట్లో వారు ప్రార్ధనలను చేసుకుంటే ఉత్తమమని అన్నారు. ప్రార్ధనల సమయంలో భౌతిక దూరం పాటించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలన్నారు.



Next Story