ప్రధాని మోడీతో అమిత్ షా భేటీ

by Shamantha N |
ప్రధాని మోడీతో అమిత్ షా భేటీ
X

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సమావేశమయ్యారు. లాక్‌డౌన్ 4.0 ముగిశాక, మే 31 తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, సూచనలను ప్రధానికి అమిత్ షా వివరించారు. నాలుగో విడత లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి వ్యూహంపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోపు నిర్ణయం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి వ్యూహం అవలంభించాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనే విషయమై అమిత్ షా గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని చాలా మంది సీఎంలు ఈ చర్చలో అభిప్రాయం వ్యక్తం చేసినట్టు హోంశాఖ వెల్లడించింది.ఆర్థికంతో పాటు సామాజిక, మతపరమైన వెసులు బాటులనూ కల్పించాలని కర్ణాటక లాంటి కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. గతంలో లాక్‌డౌన్ పొడిగింపునకు సంబంధించి సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించేవారు. కానీ, ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల సీఎం నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed