ట్రెండింగ్ లో చికెన్ మోమో రెసిపీ

by Shyam |   ( Updated:2020-05-09 06:01:33.0  )
ట్రెండింగ్  లో చికెన్ మోమో రెసిపీ
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వల్ల స్వీట్ షాప్స్ మూత పడ్డాయి. బిర్యానీ వాసనలు రావట్లేదు. పానీపూరీ బండ్లు దర్శనమివ్వడం లేదు. హర్యానా జిలేబీ కనిపించడం లేదు. సమోసాలు, మోమోలు ఇతర స్నాక్స్ ఏవీ కూడా అమ్మడం లేదు. దాంతో వీటికి సంబంధించిన వంటకాలు గూగుల్ లో ట్రెండింగ్ లో నిలిచాయి.

గూగుల్ సెర్చింగ్ ట్రెండ్స్ లో కొన్ని వంటకాలు రికార్డు స్థాయిలో ట్రెండింగ్ లో నిలిచాయి. ఏప్రిల్ 19న ‘చికెన్ మోమో రెసిపీ’ 4,350 శాతంతో గూగుల్ సెర్చింగ్ ట్రెండ్స్ లో టాప్ వన్ ప్లేస్ లో నిలవగా, ‘మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ’ 3,250 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

డాల్గొనా కాఫీ : ఈ కాఫీ ఆన్ లైన్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ కాఫీ ని తయారు చేసే విధానంతో పాటు, దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా :

కేకు తయారీకి సంబంధించిన సెర్చింగ్ లు ఏప్రిల్ నెల మొత్తం ట్రెండింగ్ లో నిలిచాయి. అంతేకాకుండా సమోస, జిలేబి, మోమో, దోక్లా, పానీ పూరి, దోశ, పనీర్ డిషెస్ గురించి జనాలు ఎక్కువగా సెర్చ్ చేశారు.

మూడులో కరోనా :

ఏప్రిల్ లో భారత దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో కరోనాకు మూడో స్థానం దక్కింది. అంతేకాకుండా కరోనా వైరస్ ప్రివెన్షెన్ టిప్స్, లాక్డౌన్ న్యూ గైడ్ లైన్స్, ‘హౌ టు గెట్ ఈ -పాస్ ఇన్ లాక్డౌన్’ ‘హౌ కేరళ కంట్రోల్డ్ కరోనా వైరస్’ లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క్రికెట్, సినిమాలతో పాటు, లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుంది, లాక్డౌన్ పొడిగిస్తారా వంటివి కూడా ట్రెండింగ్ లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది.

Advertisement

Next Story