- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ మగవాళ్లంతా ఆడవాళ్లగా మారుతారంటా !
దిశ, వెబ్ డెస్క్ : పండగల సందర్భంగా ఒక్కో ప్రాంతంలో ఒక విధమైన ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. అయితే హోళి పండగ సందర్భంగా అక్కడ ఓ వింత ఆచారం ఉంది. ఈ ఆచారంలో భాగంగా హోలీ పండుగ పాల్గుణ మాసం శుద్ద దశమి నాడు ఓ గ్రామంలోని మగవాళ్లంతా పూర్తిగా ఆడవారిగా మారిపోతారు. కట్టు, బొట్టు, మాట తీరు.. ఇలా మొత్తం మహిళల మాదిరిగా సింగారించుకుంటారు. తలపై నైవేద్యంతో నింపిన కుంభాన్ని పెట్టుకుని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వస్తారు. అయితే ఈ ఆచార సాప్రదాయం కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరులో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దీనిని కాముని దహనం అని పిలుస్తుంటారు.
ఈ కాముని దహనం సందర్భంగా మగవాళ్లంతా ఆడవారిగా మారిపోయి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి వస్తారు. వారు తిరిగి వచ్చే క్రమంలో తమకు ఇష్టమున్న వ్యక్తులను బండబూతులతో విరుుకపడుతారు. ఆయా వ్యక్తులు గతంలో చేసిన బండారం మొత్తం తిట్ల రూపంలో బయట పెడుతారు. అలాగే ఇష్టమున్న వ్యక్తులు కనిపిస్తే గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. ఈ బూతుపురాణం, ఆలింగనాలను వాళ్లు రతి, మన్మథుల ఆశీస్సులుగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కుటుంబానికి అంతా మంచి జరుగుతోందని విశ్వసిస్తారు. నిష్టతో తమ ఇలవేల్పు రతి, మన్మథులకు మొక్కుబడి తీర్చుకునే క్రమంలోనే వింత ఆచారం కొనసాగుతోంది. వింత ఆచారం చూసే వాళ్లకు మాత్రం తరువాత పెద్ద గొడవలే జరుగుతాయోమోనన్న ఆందోళన కలిగిస్తోంది. వందేళ్లకు పైగా ఈ వింత ఆచారం ప్రశాంతంగానే ఎలాంటి గొడవలు లేకుండానే కొనసాగుతోంది.అయితే ఈపండుగ ఆదివారం నంచి రెండు రోజులు గ్రామస్తులు ఘనంగా జరుపుకుంటారు.