స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోకి హెచ్​ఎండీఏ

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రధాన పరిపాలన కార్యాలయం తార్నాక నుంచి అమీర్‌పేట్​కు మారింది. హెచ్ఎండీఏ అన్ని విభాగాలను మైత్రివనం కాంప్లెక్స్ పక్కనే ఉన్న స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్స్‌లోని 2,4,5,7 అంతస్తుల్లోకి ఆగస్టు 3‌నుంచి మారనున్నాయి. సాధారణ ప్రజానీకం, సంబంధిత సంస్థలు అడ్రస్ మార్పు విషయాన్ని గుర్తించాలని హెచ్​ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.

Advertisement