అమ్మాయి మిస్సింగ్ కేసులో అడివి శేష్

by Shyam |
HIT 2
X

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని ఓవైపు హీరోగా నటిస్తూనే, తనకు నచ్చిన కొత్త కాన్సెప్ట్‌లను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మేరకు తొలి ప్రయత్నంగా ‘వాల్‌పోస్టర్‌’ బ్యానర్‌పై ‘అ!’ మూవీ రూపొందించిన నాని.. రెండో సినిమా ‘హిట్‌’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘హిట్ ‌2’ చిత్రాన్ని ఈ రోజు (శనివారం) లాంఛనంగా ప్రారంభించారు. ‘ది సెకండ్‌ కేస్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌ కాగా ‘హిట్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ కూడా రూపొందనుంది.

https://twitter.com/NameisNani/status/1373114600229498881?s=20

అడివి శేష్‌ హీరోగా కృష్ణదేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌.. అమ్మాయి మిస్సింగ్‌ కేసును ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో ‘హిట్‌’ ‌రూపొందగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణదేవ్‌ ఈ ఎగ్జైటింగ్‌ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

Next Story