- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు పెరిగాయ్..
దిశ, వెబ్‌డెస్క్ : డిజిటలైజేషన్, ఆటోమేషన్ ఫలితంగా ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు భారీగా నమోదయ్యాయి. భారత్‌లో డిజిటల్ టెక్నాలజీ అధికంగా వినియోగించడం వల్ల జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఉద్యోగ నియామకాలు రికార్డు స్థాయిలో 33 శాతం వృద్ధి నమోదైనట్టు ఓ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని పరిశ్రమల్లోనూ కలిపి జనవరి నెలకు సంబంధించి 1,925 నియామకాలు జరగ్గా, ఫిబ్రవరిలో ఇది ఏకంగా 2,356కు పెరిగిందని నౌక్రీ జాబ్‌స్పీక్స్ ఇండెక్స్ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మెరుగవడం, మార్కెట్లు సాధారణ స్థాయికి చేరుకోవడంతో కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత మొదటిసారిగా కీలక పరిశ్రమల్లో నియామక కార్యకలాపాలు సానుకూలంగా ఉన్నాయని నౌక్రీ జాబ్స్ తెలిపింది.
రంగాల వారీగా చూస్తే.. ఫిబ్రవరి నెలకు సంబంధిచ్ని టెలికాం రంగంలో 24 శాతం వృద్ధి నమోదవగా, వైద్య/ఆరోగ్య సంరక్షణ వంటి ఇతర కీలక రంగాల్లో 28 శాతం, విద్య/బోధనలో 25 శాతం, ఎగ్ఎంసీజీ 20 శాతం వృద్ధిని సాధించాయి. ఇక, బీమా రంగంలో నియామక ధోరణి 1 శాతం క్షీణతను చూసిందని నివేదిక స్పష్టం చేసింది. నగరాల వారీగా చూస్తే.. ఆరు మెట్రో నగరాలు, టైర్2 నగరాల్లో సానుకూల నియామక కార్యకలాపాలు నమోదయ్యాయి. మెట్రోల్లో బెంగళూరు 31 శాతం, హైదరాబాద్ 28 శాతం, పూణె 24 శాతంతో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. టైర్2 నగరాల్లో అహ్మదాబాద్ 31 శాతం, వడోదర 20 శాతం వృద్ధిని సాధించాయి.