- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందూస్తాన్ జింక్ నికర లాభం రూ.1,940 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: వేదాంత గ్రూపులో భాగమైన హిందూస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం వార్షిక ప్రాతిపదికన 7 శాతం క్షీణినంచినట్టు వెల్లడించింది. ప్రధానంగా అధిక తరుగుదల, ఆర్థిక వ్యయాల కారణంగా కంపెనీ లాభాలు తగ్గాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 9 వేల కోట్ల మధ్యంత డివిడెండ్‌ను ప్రకటించింది.
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,940 కోట్లుగా ఉందని మంగళవారం తెలిపింది. త్రైమాసికం ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 43 శాతం పెరిగిందని పేర్కొంది. ‘ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ రికార్డు పనితీరును నమోదు చేశాం. రానున్న త్రైమాసికంలో మరింత వృద్ధిని సాధించేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము’ అని హిందుస్తాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా చెప్పారు.
సమీక్షించిన త్రైమాసికంలో మధ్యంతర డివిడెండ్ ప్రతి షేర్‌కు రూ. 2 కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. వేదాంత లిమిటెడ్ గ్రూప్ హిందూస్తాన్ జింక్ సంస్థలో 64.9 శాతం వాటాను కలిగి ఉంది. కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మెటల్ ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగి 238 కిలో టన్నులు, త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ మెటల్ ఉత్పత్తి 18 శాతం పెరిగినట్టు కంపెనీ పేర్కొంది.