- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలవర పెట్టిన కాలం
దిశ, వెబ్‌డెస్క్: 2020 సంవత్సరం మాయని మచ్చ వేసింది. యావత్తు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కలవరపెట్టింది. ఇక దేశం విషయానికి వస్తే..
జనవరి
1
= తెలంగాణ 5వ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్
= నీటి పారుదల సలహాదారుడిగా మాజీ సీఎస్ ఎస్కే జోషి నియామకం
= సీఏఏపై వ్యతిరేకత .. ఆన్ లైన్ పౌరసత్వ నమోదుకు కేంద్రం యోచన
= 2020 నుమాయిష్ ప్రారంభం
2
= ఒకే దేశం- ఒకే రేషన్ ప్రారంభం
= తెలంగాణ, ఏపీ సహా 12 రాష్ట్రాలలో అమలు
= రాజ్ భవన్ లో నెలకో సారి ప్రజా దర్బార్ – గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
= అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) కొత్త డైరెక్టర్ గా డాక్టర్ డీకే సిన్హా
= నిఫ్ట్ డైరెక్టర్ గా విజయ్ కుమార్ మంత్రి నియామకం
= ఆర్టీసీలో సంక్షేమ మండలుల ఏర్పాటు
4
= అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక జనరల్ హతం
8
= నిర్భయ దోషులు నలుగురికి ఏకకాలంలో ఉరి తీర్పు
= కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె
= హాస్య రచయిత ఆదివిష్ణు కన్నుమూత
14
= బైంసాలో అల్లర్లు – కర్ఫ్యూ
= కథా రచయిత వెంకట్రామయ్య కన్నుమూత
18
= విజయవంతంగా జీశాట్ -30 ప్రయోగం
19
= మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్టు
20
= అణు క్షిపణి సక్సెస్ – జలాంతర్గామి నుంచి ఖండాతర కె-4 ప్రయోగం
21
= బీజేపీ నేషనల్ చీఫ్ గా జేపీ నడ్డా
= మార్క్సిస్ట్ మేధావి విఠల్ కన్నుమూత
22
= రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు
25
= బీమా కోరెగాం కేసు ఎన్ఐఏ కు బదిలీ
26
= ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సింధుకు పద్మభూషణ్ ప్రకటన
30
= ఆదిలాబాద్ జిల్లాలో సమత హత్యాచారం కేసులో ముగ్గురికి ఉరి తీర్పు
31
= సహకార ఎన్నికల నోటిఫికేషన్ – ఫిబ్రవరి 15న ఎన్నికలు
ఫిబ్రవరి
2
= పార్లమెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశం
5
= మేడారం జాతర ప్రారంభం
= అయోధ్య ట్రస్ట్ చైర్మన్ గా సీనియర్ న్యాయవాది పరాశరన్
7
= హాజీపూర్ ఘటనలో సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష
= మెట్రో కారిడార్ -2 ప్రారంభం
11
= రాష్ట్రంలో ఐదుగురు సమాచార కమిషనర్ల నియామకం
13
= రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి
15
= రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఎన్నికలు
17
= సీసీఏ ను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం
24
= నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా ట్రంప్ భారత్ పర్యటన
28
= 68 జూనియర్ కాలేజీలు రద్దు
మార్చి
1
= డబుల్ ఇండ్ల గురించి ప్రగతి భవన్‌ను ముట్టించిన ఖమ్మం మహిళలు
2
= రైతులందరికీ త్వరలోనే రుణమాఫీ .. కేసీఆర్ ప్రకటన
3
= కరోనా కోసం ప్రభుత్వాసుపత్రులలో మూడు వేల పడకలు సిద్ధం; రూ. 100 కోట్ల తక్షణ సాయాన్ని విడుదల చేసిన రాష్ట్ర సర్కారు
4
= ఎన్‌పీఆర్ అమలు కుదరదు – అభ్యంతరకర వివరాల సేకరణ ప్రమాదం అంటున్న కేసీఆర్
5
= కేటీఆర్ ఫామ్ హౌజ్‌ను డ్రోన్‌తో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు; సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
6
= అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం; గవర్నర్ ప్రసంగం; మాంద్యాన్ని సైతం తట్టుకుని తెలంగాణ నిలబడిందని ప్రశంస
7
= డాక్టర్లకు సెలవుల్ని రద్దు చేసిన సర్కారు; కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సభలో ఉండడానికి అర్హతే లేదు- కేసీఆర్
8
= వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు; రసూ. 1.83 లక్షల కోట్లతో భారీ బడ్జెట్
= పరువు హత్య కేసులో నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య
11
= రాష్ట్ర బీజేపీ సారథిగా బండి సంజయ్ నియామకం
12
= రాజ్యసభకు టీఆర్ఎస్ తరఫున కేకే, సురేష్ రెడ్డి పేర్లను ఖరారు చేసిన సీఎం కేసీఆర్
13
విద్యుత్ ఛార్జీలను పెంచుతామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్; ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం
14
= మార్చి 31 వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు సీఎం ప్రకటన
= కరోనా నివారణకు రూ. 500 కోట్లు విడుదల చేసిన సర్కారు
16
= సీఏఏ వద్దు – ఎన్‌పీఏ, ఎన్నార్సీలనూ పునస్సమీక్షించండి – అసెంబ్లీలో సీఎం కేసీఆర్
17
= నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత
18
= రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేశ్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
= సచివాలయానికి సందర్శకులకు అనుమతి బంద్
19
= కరోనా కట్టడిపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష .. విదేశీ ప్రయాణికుల కోసం గ్రామాలను జల్లెడ పట్టాలని ఆదేశం
= ఇండోనేషియా దేశస్తులు వచ్చారన్న వార్తలతో కరీంనగర్ హై అలర్ట్
= మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన; శంషాబాద్‌లోనూ విమానాలు బంద్
20
= 23 నుంచి జరిగే అన్ని పరీక్షలనూ నిరవధికంగా వాయిదా వేయాలని ఆదేశించిన హైకోర్టు
22
= జనతా కర్ఫ్యూ;కు కేంద్ర ప్రభుత్వం పిలుపు .. ప్రగతి భవన్‌లో చప్పట్లు కొట్టి మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్
= 31 వరకు షట్‌డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం; తలా పన్నెండు కిలోల బియ్యం, రూ. 1500 నగదు ఇస్తామన్న కేసీఆర్
23
= రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం
24
= దేశవ్యాప్తంగా 21 రోజుల సంపూర్ణ బంద్ (మొదటి లాక్‌డౌన్) ప్రారంభం..రహదారులను బంద్ చేసిన గ్రామీణులు
25
= కరోనా నష్టానికి రూ. 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
28
= కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన వలసకార్మికులు; కేసులు పెరిగానా కంగారొద్దన్న రాష్ట్ర ప్రభుత్వం
29
= ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదార్లు, ప్రజా ప్రతినిధులకు జీతాలలో కోత
30
= ఒక్కరోజే ఐదుగురు కరోనాతో మృతి; ఒకే కుటుంబంలో పాతిక మందికి కరోనా
31
= కరీంనగర్‌లో కంటైన్‌మెంట్ జోన్లు మొదలు; ఆపరేషన్ మర్కజ్ పేరుతో పోలీసుల గాలింపు
ఏప్రిల్
1
= లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం.
= ఏప్రిల్ 14 వరకూ మద్యం దుకాణాలు బంద్ చేస్తూ ఆదేశాలు
2
= కరోనా కట్టడిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వీడీయో కాన్ఫరెన్స్
= భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామ నవమి వేడుకలు
= ఆరోగ్య సేతు యాప్‌ను ప్రారంభించిన కేంద్రం
3
= ఉపాధి కోల్పోయిన అసంఘటితరంగ కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు
5
= ప్రధాన మంత్రి పిలుపుతో రాత్రి తొమ్మిది గంటలకు దేశమంతా కొవ్వొత్తులు, దీపాలు
6
= కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
= రెండేండ్ల పాటు ఎంపీ ల్యాడ్స్ నిలిపివేస్తూ కేంద్రం ఆర్డినెన్స్
= కరోనాపై సమాచారం కోసం వాట్సాప్ (9000658658) ప్రారంభించిన తెలంగాణ సర్కార్.
7
= లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రాలు
= రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కారనంగా పంట నష్టం
9
= గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ. 1.70 లక్షల కోట్ల మెగా ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
= కిడ్నీ సమస్యతో నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి
11
= ఏప్రిల్ 30 వరకూ లాక్‌డౌన్ పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
12
= పరీక్షలన్నింటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న ఉన్నత విద్యామండలి
= రెండు ప్రత్యేక విమానాలలో 165 మంది అమెరికన్లను సొంత ప్రాంతాలకు తరలింపు
14
= లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన గూడ్స్ వాహనాలకు అనుమతి. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
16
= దళిత ఉద్యమ నేత మాజీ ఎంపీ తులసీ రామ్ మరణం
17
= కరోనా కట్టడి కోసం రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేత
21
= కరోనాకు ప్రత్యేక వెంటిలేటర్ ఐకో- వెంట్‌ను ఆవిష్కరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
23
= కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులు ఒకటి లోగా ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశాలు
24
= రంగనాయక్ సాగర్ ప్రారంభం
27
= నిరాడంబరంగా తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
28
= భద్రాద్రిలో నిత్య కల్యాణాలు ప్రారంభం
29
= ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
= కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తూ కోర్టు నిర్ణయం
30
= బాలీవుడ్ నటుడు రుషి కపూర్ లుకేమియాతో మరణం.
మే
1
= మిథాని సీఎండీగా సంజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ.
2
= హైకోర్టు న్యాయమూర్తిగా విజయసేన్ రెడ్డి ప్రమాణ స్వీకారం
= రంగనాయక్ సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
5
= కరోనా నేపథ్యంలో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులు నేరుగా ప్రమోట్
= రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న మీసేవా కేంద్రాలు
10
= మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అనారోగ్యంతో మృతి
13
= ఆలేరు మాజీ ఎమ్మెల్యే చల్లూరు పోచయ్య (85) గుండెపోటుతో మృతి
18
= ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల నిరసన
19
= లాక్‌డౌన్ తర్వాత ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు
20
= ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ ఆర్డినెన్స్ జారీ
25
= హాకీ లెజండ్ బల్బీర్ సింగ్ మృతి
27
= పీజీ మెడికల్ ఫీజుల పెంపును సవరిస్తూ హైకోర్ట్ ఉత్తర్వులు
జూన్
6
= పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వ నిర్ణయం
8
= లాక్‌డౌన్ తర్వాత తెరుచుకున్న ఆయలయాలు, హోటళ్లు
= తెలంగాణ హెచ్ఆర్‌సీ కార్యదర్శిగా వి.చక్రవర్తి నియామకం
9
= కృష్టా, గోదావరి జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం
10
= ఫాంహౌస్ కేసులో మంత్రి కేటీఆర్‌కు ఊరటనిస్తూ హైకోర్టు మధ్యంతర స్టే జారీ.
11
= ముఖ్యమంత్రిని కలిసేందుకు కాంగ్రెస్ చలో సెక్రెటేరియట్
= ఇంటర్ విద్యార్థుల కోసం వెబినార్ ఏర్పాటు చేసిన బోర్డు
12
= సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి నారాయణరావు మృతి
17
= ముఖ్యమంత్రులతో పీఎం వీడీయో కాన్ఫరెన్స్
26
= కరోనా అధ్యయనానికి రాష్ట్రానికి చేరుకున్న కేంద్రబృందం
28
= పీవీ శతజయంతి వేడుకలు ప్రారంభం
30
= యూజీ, పీజీ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
జూలై
1
= కరోనా నివారణలో విఫలమయ్యారని ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
= మహదేవపూర్ దగ్గర గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి
= మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్వగ్రామం వేల్పూరులో 150 ముస్లిం కుటుంబాల వెలి
2
= విరసం నేత వరవరరావుకు తీవ్ర అనారోగ్యం. ఆస్పత్రికి తరలింపు
= మేడ్చల్ జిల్లా ఘట్కేసరిలో ఓ చిన్నారి, మహిళ హత్య.
3
= యూపీలో పోలీసులపై క్రిమినల్స్ కాల్పులు. 8 మంది పోలీసుల మృతి
= లడాఖ్ లో ప్రధాని మోడీ పర్యటన
4
= టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మృతి
7
= తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం. ఆరు దశాబ్దాల చరిత్ర ధ్వంసం
8
= కరోనాతో ప్రజా గాయకుడు నిస్సార్ మృతి
9
= ఇంటర్ సెకండియర్ 1.28 లక్షల మంది విద్యార్థులను పాస్ చేస్తూ ఉత్తర్వులు
= రూ. 1.20 లక్షల లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య యాదవ్ ఏసీబీ వలలో
10
= తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్
= నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నలుగురు పేషెంట్ల మృతి
11
= గాంధీలో విధులు బహిష్కరించిన నర్సులు. రెగ్యులర్ చేయాలని ఆందోళన. పేషెంట్ల ఇబ్బందులు
12
= కరోనా నేపథ్యంలో బోనాల పండుగ నిరాడంబరంగా మొదలు
13
రాష్ట్రంలో నీటిపారుదల శాఖను ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రభుత్వ నిర్ణయం
15
= కరోనా అంశంలో హెల్త్ సెక్రెటరీ శాంతి కుమారిపై బదిలీ వేటు
16
– విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్
17
= తెలంగాణ సచివాలయాన్ని కూల్చుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
19
= కరోనాకు వ్యాక్సిన్. నిమ్స్ లో తొలి డోస్ షురూ చేసిన భారత్ బయోటెక్
= టీ 20 వరల్డ్ కప్ రద్దు చేస్తూ ప్రకటన
21
అయోధ్య పూజకు యాదాద్రి మట్టి తరలింపు
22
= బాలల హక్కుల ఉద్యమ నేత అచ్యుతరావు కరోనాతో మృతి
24
= ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పుటూరి సాంబశివరావు (ఉ.సా.) కరోనాతో మృతి
28
= కరోనా మీద తప్పుడు బులిటెన్లు ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్. కోర్టుకు హాజరైన సీఎస్
29
= రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత
30
= మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్ లో రైతుపై లారీ ఎక్కించి హత్య చేసిన ఇసుక మాఫియా
= రైతు వేదిక నిర్మాణం కోసం పొలాన్ని లాక్కోవడంతో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య
31
= ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
= ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృతి.
= సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ నియామకం
ఆగస్టు
1
= విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ తెగి 10 మంది మృతి
= కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
3
= ఆక్స్ ఫర్డ్ టీకా ట్రయల్స్ కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
4
= కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
= ఉత్తరాంధ్రకు చెందిన కళాకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి
5
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్. చెన్నై ఆస్పత్రిలో చేరిక
6
= దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూత
= మహారాష్ట్రలో భారీ వర్షాలు. నీట మునిగిన ముంబై
= అహ్మదాబాద్ కోవిడ్ ఆస్పత్రిలో ఆగ్ని ప్రమాదం. 8 మంది పేషెంట్ల మృతి.
= కృష్ణా జిల్లా బావులపాడు మండలం రేమిల్లిలో కార్ డోర్ లాక్ అయి ఊపిరాడక ముగ్గురు చిన్నారుల మృత్యువాత
7
= కేరళలోని కోళికోడ్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం. 16 మంది మంది మృతి
8
= కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కరోనాతో మృతి
9
= విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో ఫైర్ యాక్సిడెంట్… 10 మంది పేషెంట్ల మృతి
10
= ఆస్తిలో కొడుకు, కూతురుకు సమాన వాటా కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు
14
= రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు
= వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో క్షుద్రపూజలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్య
15
= టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై
16
= యూపీలో దళిత బాలిక గ్యాంగ్ రేప్…హత్య
= రాష్ట్రంలో భారీ వర్షాలు. నీట మునిగిన కరీంనగర్, వరంగల్
17
= కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాజీనామా
= కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్ణారెడ్డి మృతి.
21
= శ్రీశైలంలో ఉన్న జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరరాజా ఉద్యోగులు మృతి
= క్రికెటర్ రోహిత్ శర్మకు ఖేల్ రత్న. ఇషాంత్, రాంకీలకు అర్జున అవార్డులు
= తనను 139 మంది, 5 వేల సార్లు రేప్ చేశారని దళిత మహిళ ఫిర్యాదు
24
= ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా బుద్దా మురళి. సదారాం పదవీ విరమణతో నియామకం
= ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీకే పగ్గాలు
27
= రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధుకు కేంద్రం ప్రశంసలు
29
= కుప్పకూలిన కొండపోచమ్మ సాగర్ వంతెన
= రాష్ట్రంలో ఆన్ లాక్ 4.0. మెట్రోకు గ్రీన్ సిగ్నల్
31
= మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనాతో కన్నుమూత
= టీఎన్జీఓ అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్.
= రాష్ట్రంలో మొదలైన డిజిటల్ పాఠాలు.
సెప్టెంబరు
1
= అనధికార లేఔట్లకు ఎల్ఆర్ఎస్ ప్రకటన; ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
2
విద్యార్థులకు టీశాట్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు
3
= రెవెన్యూ శాఖ ప్రక్షాళన – కొత్త చట్టానికి అసెంబ్లీ ఆమోదం
4
= కరోనా లెక్కల విషయంలో సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
5
= సులభతర వాణిజ్య విధానంలో పడిపోయిన తెలంగాణ ర్యాంకు
= రెవెన్యూ అధికారాలకు కోత పెట్టాలని కేసీఆర్ నిర్ణయం
6
= వీఆర్వో వ్యవస్థకు మంగళం
8
= భూముల రిజిస్ట్రేషన్లు బంద్; రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి
9
= పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం
= 11 అంతస్తులతో కొత్త సచివాలయం ప్లాన్ ఖరారు
11
= రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్
= మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో
12
= తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా మాణిక్కం ఠాగూర్
= మానవహక్కుల కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత
13
= యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
14
= టీఎస్-బీపాస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
15
= కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
25
= సినీ నేపథ్య గాయకుడు ఎస్పీబీ కరోనాతో మృతి
= రాష్ట్రవ్యాప్తంగా బార్లకు ప్రభుత్వం అనుమతి
అక్టోబర్
1
= సినిమా హాళ్లకు కేంద్రం అనుమతి. అన్ లాక్ 5.0 మార్గదర్శకాల విడుదల. ఇండోర్ మీటింగులకు 200 మంది వరకు అనుమతి
3
= దేశంలో లక్ష కరోనా కేసులు నమోదు. ప్రపంచంలోనే మూడో స్థానం
4
నయీం కేసులో 25 మంది పోలీసులకు విముక్తి
6
= పోతిరెడ్డిపాడు విస్తరణను ఆపాలని అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ వాదన
7
= రైతుల దగ్గరికే వెళ్లి వడ్డు కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు
= నవంబరు ఒకటో తేదీ నుంచి డిగ్రీ కళాశాలు ఓపెన్ చేస్తామన్న విద్యా శాఖ
9
= కిడ్నీ, లివర్, గుండె మార్పిడి వంటి చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీలోకి
10
= నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత విజయం
11
= జీహెచ్ఎంసీలో 50 శాతం వార్డులను మహిళలకే కేటాయించాలన్న చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం
12
= ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావును నక్సలైట్లు హతమార్చారు
14
= హైదరాబాదులో కుంభవృష్టి. 32 సెం.మీ. భారీ వాన. వేలాది అపార్టుమెంట్లల్లోకి నీళ్లొచ్చాయి. చెరువులు తెగాయి. సముద్రాన్ని తలపించింది
= అసెంబ్లీ సమావేశం. అగ్రికల్చర్ ల్యాండ్, ఇండియన్ స్టాంప్ చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం, జీహెచ్ఎంసీ చట్ట సవరణల బిల్లుల ఆమోదం
15
= కీసర భూ సంబంధ కేసులో ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైల్లో ఆత్మహత్య
= కూచిపూడి నృత్యకారణి శోభానాయుడు కరోనాతో చనిపోయారు
20
వర్షాలకు దెబ్బ తిన్న ఇండ్లకు ఇంటికి రూ.10 వేల ఆర్ధిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన
22
= మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి
23
= వరదలతో రూ.9422 కోట్ల నష్టం వాటిల్లింది. కేంద్ర బృందానికి సీఎస్ నివేదిక
30
= మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
నవంబరు
1
= పింఛన్లకు కేంద్రం నిధులు ఇస్తుందని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాల్
3
= దుబ్బాక ఉప ఎన్నిక
7
= తెలంగాణలో రూ.20.761 కోట్ల పెట్టుబడికి అమెజాన్ ఆమోదం
11
= దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం
14
= ఎమ్మెల్సీలుగా గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ ఎంపిక
16
= జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.3 వేలు పెంచారు. ఆస్తి పన్నులో ఈ ఏడాదికి 50 శాతం రాయితీ
17
= టీఎస్ బీ పాస్ విధానాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
18
= జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లు షురూ
21
= బల్దియా ఎన్నికల నామినేషన్లు పూర్తయ్యాయి. 3220 మంది నామినేషన్లు
డిసెంబరు
1
= బల్దియా ఎన్నికలు
2
= నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోయారు.
3
= హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఏడుగురు మృతి
4
= బల్దియా ఎన్నికల కౌంటింగ్. టీఆర్ఎస్ కు 56, బీజేపీకి 48, ఎంఐఎంకి 44 స్థానాలు
6
= జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నాయకులకు మంత్రి కేటీఆర్ పిలుపు
8
= కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బారత్ బంద్ …టీఆర్ఎస్ పార్టీ మద్దతు
9
= మంత్రి మల్లారెడ్డిపై దుండిగల్ పోలీసు స్టేషన్ లో కేసు. భూమిని ఆక్రమించారని మహిళ ఫిర్యాదు
10
= కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు జారీ
= నేనే సీఎం అభ్యర్ధిని… కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్న మాజీ మంత్రి జానారెడ్డి
12
= ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు.
= అమిత్ షాతో సీఎం కేసీఆర్ ఢిల్లీలో భేటీ
13
= ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ ఏకాంతంగా భేటీ
14
= రాష్ట్రంలో 50 వేల పోస్టుల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు
15
= 45 నిమిషాల పాటు గూగుల్ సేవలకు అంతరాయం
20
= పాత విధానంలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆదేశం
21
= ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూ సర్వే కు సీఎం జగన్ శ్రీకారం
25
= ఏపీలో 30,75,755 మందికి ఇండ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం
26
= నటుడు రజినీకాంత్ హైబీపీతో అపోలో ఆసుపత్రిలో చేరిక
= మంత్రి మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తప్పుడు పత్రాలు సమర్పించిందని ఐదేండ్ల పాటు న్యాక్ బ్యాన్
27
= వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆటోలోని ఐదుగురు చనిపోయారు.
29
= జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ… ఒకే గొడుగు కిందికి అన్ని విభాగాలు
30
ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
= ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు. వేతనాల పెంపు పదవీ విరమణ వయసు పెంచుపు. వేగంగా కారుణ్య నియామకాలు. పదోన్నతులు