చర్చలు కాదు.. ఫలితాలు కావాలి : హైకోర్టు

by Shyam |
చర్చలు కాదు.. ఫలితాలు కావాలి : హైకోర్టు
X

దిశ వెబ్ డెస్క్ : పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పీపీల కొరతతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు నిరాశ వ్యక్తపరిచింది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

అయితే, విచారణలో భాగంగా పీపీల నియామకానికి చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. 414 పీపీ పోస్టుల్లో 212 భర్తీ అయ్యాయని న్యాయవాది చెప్పారు. న్యాయవాది వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు చర్చలు కాదు.. ఫలితాలు కావాలని ఆగ్రహం వ్యక్తంచేసింది.

Advertisement

Next Story

Most Viewed