- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళను వణికిస్తున్న వర్షాలు.. శబరిమలలో హై అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రాన్ని అకాల వర్షాలు వణికిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా కేరళలోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో గత 12 గంటల్లో 10సెమీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
పలుచోట్లు ఉరుములు, పిడుగులతో కూడా వర్షం పడుతోందన్నారు. జిల్లాలోని మలయప్పుజ ప్రాంతం సమీపంలో గల ముస్లియార్ కాలేజీ వద్ద కొండచరియలు విరిగిపడినట్టు సమాచారం. ఈ ప్రాంతంలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇకపోతే కోజికోడ్‌లో కుండపోత వర్షం కురుస్తుండటంతో శబరిమలకు వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. ముండకయమ్, కుట్టిక్కనమ్ వెళ్లే దారుల్లో కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది. అయితే, కుమాలి రోడ్డు గుండా శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.