పరిటాలలో ఉద్రిక్తత..!

దిశ వెబ్‎డెస్క్: కృష్ణా జిల్లా పరిటాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజశేఖర్‌రెడ్డి మృతదేహంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బంధువులు రాస్తారోకో నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.

రెండు రోజుల క్రితం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే వీరిని పోలీస్‌స్టేషన్ నుంచి విడిపించిన స్థానిక టీడీపీ నేత కోగంటి బాబును పొగుడుతూ అరెస్ట్ అయిన వ్యక్తి రాజశేఖర్‌రెడ్డి ఫేస్‎బుక్‎లో ఓ పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు రాజశేఖర్‌రెడ్డిని మరోసారి స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనిని అవమానంగా భావించిన రాజశేఖర్ రెడ్డి.. కృష్ణా బ్యారేజ్‎లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement