హుస్నాబాద్‌లో హై టెన్షన్

దిశ, హుస్నాబాద్: పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు, హైటెన్షన్ తీగలు ప్రమాదకరంగా మారాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగక్ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ పొతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట జిల్లా బేగంపేట నుండి బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ బావులకు సరఫరా చేసే విద్యుత్ స్తంభాలు గత కొద్ది నెలల నుంచి రోజు రోజుకు వంగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదన్నారు.

రైతులు రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాలకు వెళ్తుంటారని, ఈ క్రమంలో పెను ప్రమాదం జరిగే అవకాశముందన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి నేలమట్టానికి చేరువలో ఉన్న విద్యుత్ స్తంభాలను మరల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement