- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరపడండి.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది కస్టమర్లు అధిక వడ్డీని అందించే బ్యాంకుల్లో తమ డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావిస్తారు. అటువంటి వారి కోసం కొన్ని ప్రైవేట్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తాజాగా ప్రకటించాయి. అయితే, ఇవి కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లు మాత్రమే. నిర్ణీత కాలపరిమితి వరకు తీసుకోవడానికి వీలులేని డిపాజిట్లపై కరోనా పాండమిక్ తర్వాత పలు బ్యాంకులు కొత్తగా ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఖాతాదారులను అట్రాక్ట్ చేసేందుకే ఈ విధమైన అత్యధిక వడ్డీ రేట్లను ఆశ చూపినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అయితే, కాలానుగుణంగా అత్యధిక ఆదాయం పొందాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. RBI (రిజర్వ్ బ్యా్ంక్ ఆఫ్ ఇండియా) రేపో రేటును 4 శాతం కనిష్ట స్థాయిలో ఉంచినందున ప్రభుత్వ, ప్రైవేటు బ్యా్ంకులు FD(ఫిక్సిడ్ డిపాజిట్)లపై తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.అయితే, కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ మాత్రం ఎక్కువ కాలపరిమితి అనగా FD లపై 6.3 శాతం వడ్డీ రేటును అందించనున్నట్టు తెలిపాయి. దీని ప్రకారం.. మూడేళ్లకు పైన ఫిక్సిడ్ డిపాజిట్‌లపై ఉత్తమ వడ్డీరేటును ఇచ్చే బ్యాంకులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
1.DCB బ్యాంక్ మూడేళ్ళ ఫిక్సిడ్ డిపాజిట్ పై 5.95% వడ్డీ అందిస్తుంది. అనగా లక్ష పెట్టుబడితే మూడేళ్ళలో రూ.1.19 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
2.IndusInd బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ పై 6% వడ్డీని అందిస్తుంది. దీని ప్రకారం.. రూ.లక్ష పెడితే మూడేళ్లలో దాని విలువ రూ.1.19 లక్షలకు పెరుగుతుంది.
3.RBL బ్యాంక్ మూడేళ్ల FD పై 6.30% వడ్డీని అందిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ బ్యాంక్ మాత్రమే అత్యధిక వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే మూడేళ్లలో రూ.1.21 లక్షల ఆదాయం వస్తుంది.
4. YES బ్యాంక్ మూడేళ్ల FD పై 6.25% వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే మొత్తం మూడేళ్లలో రూ.1.20 లక్షలకు పెరుగుతుంది.
Disclaimer: పూర్తి వివరాల కోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించగలరు.