‘ఉస్మానియా’ కూల్చివేతపై మరోసారి విచారణ..

by Shyam |   ( Updated:2020-09-07 23:42:35.0  )
‘ఉస్మానియా’ కూల్చివేతపై మరోసారి విచారణ..
X

దిశ, వెబ్‌డెస్క్ : శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత, దాని స్థానంలో కొత్త ఆస్పత్రి నిర్మాణంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. ఉస్మానియా కూల్చివేతకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లు కలిపి ఇవాళ హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారించనుంది. ప్రస్తుతమున్న భవనం శిథిలావస్థకు చేరిందని.. అది ఎప్పుడు కూలిపోతుందోనని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని.. అందువలన దాని స్థానంలో నూతన భవనం నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

అయితే, ప్రస్తుతమున్న ఉస్మానియా ఆస్పత్రి భవనం పురాతన కట్టడం అని, దానిని కూల్చొద్దంటూ పలువురు పిటిషనర్లు వాదిస్తున్నారు. ఎర్రమంజిల్ భవనంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్లు ప్రస్తావించారు. ఎర్రమంజిల్‌కు ఇచ్చిన తీర్పు ఉస్మానియా ఆస్పత్రికి కూడా వర్తిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా, ఉస్మానియా గూగుల్ సైట్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed