- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు స్టేలు ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ ఎందుకు కోరడం లేదని హైకోర్టు ప్రశ్నిచింది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకూ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడింది. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్ష అక్రమ నిర్మాణాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించింది. కాగితాల్లో నిబంధనలు బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు నివేదించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశించింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని చివరి అవకాశం ఇస్తూ హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాకుండా.. తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది.