- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ అభ్యర్థుల సంతానంపై హైకోర్టు విచారణ..
దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంతానంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్ర సర్కార్ కొత్త నిబంధనను పెట్టింది.
అయితే, ఈ చట్టంపై పలు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవ్వగా.. న్యాయమూర్తి ఇవాళ విచారణ జరిపారు. ఈలాంటి నిబంధనను రాష్ట్రంలో ఎక్కడా లేకుండా కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే పెట్టడం ఎంటనీ పిటిషనర్లు శ్రీధర్ బాబు, రవి, తాహీర్ కోర్టుకు తమ వాదనలను వినిపించారు. దీనిపై స్పందించిన కోర్టు ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలాఉండగా, దీపావళి పండుగ అనంతరం గ్రేటర్ ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఎన్నికల కమిషనర్ గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకోవడం కూడా ఆ వాదనకు బలం చేకూరుస్తోంది.