- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ సీఎస్, డీజీపీలకు హైకోర్టు నోటీసులు..
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్, సీఎస్ సమీర్ శర్మలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసులు సీఆర్పీసీలోని 54, 57 సెక్షన్లు పాటించట్లేదంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి.. డీజీపీ, సీఎస్‌లకు హైకోర్టు నోటీసులిచ్చింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలీసులు సీఆర్పీసీలోని 54, 57 సెక్షన్ల కింద అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ లలిత్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. సీఆర్పీసీ సెక్షన్ 57కింద అదుపులోకి తీసుకున్న వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించాకే విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనానికి నివేదించారు. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని చట్టంలో ఉందన్నారు.
ఈ ఏడాది ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం నేత బ్రహ్మం చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. డీజీపీ, సీఎస్‌లకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.