హైకోర్టు తీర్పు వైసీపీకి అనుకూలమే : సీపీఐ రామకృష్ణ

by srinivas |   ( Updated:16 Sept 2021 8:21 AM  )
CPI Ramakrishna
X

దిశ, ఏపీ బ్యూరో: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వచ్చిందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నుండి పోలింగ్ వరకు ఏకపక్షంగా సాగాయని ఆరోపించారు. అధికారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియ గడిచిందని, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏకపక్షమేనని రామకృష్ణ ఆరోపించారు.

Next Story

Most Viewed