పీఎంఏవై పథకంపై హైకోర్టులో విచారణ

by srinivas |
పీఎంఏవై పథకంపై హైకోర్టులో విచారణ
X

దిశ, ఏపీ బ్యూరో: పీఎంఏవై (ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన) పథకం కింద నిర్మించిన ఇళ్ల గురించి ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఇప్పటివరకు నిర్మించిన ఇళ్లను అర్హులకు అందించట్లేదని దాఖలైన పిటిషన్‍పై హైకోర్టు విచారణ చేపట్టింది. 85 వేల ఇళ్లను నిర్మించినా అర్హులకు ఇవ్వట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందని ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story