కరోనా నియమాలు పాటిస్తూ పరీక్షలు

దిశ, వెబ్‌డెస్క్: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అలాగే, ప్రభుత్వ పరమైన వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. టీఎస్‌ హైకోర్టులో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలపై మంగళవారం విచారణ ముగిసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆయా పరీక్షలు నిర్వహించవచ్చని కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే, చివరి సెమిస్టర్ పరీక్షలను రాత పద్ధతిలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అటానమస్ కళాశాలలు మాత్రం వారికి అనుకూలమైన రీతిలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ సారి సప్లిమెంటరీ‌లో పాస్‌ అయిన విద్యార్థులను కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని వివరణ ఇచ్చింది. మరో రెండు నెలల్లో సప్లిమెంటరీ కూడా నిర్వహిస్తామని.. రేపటి నుంచి జేఎన్‌టీయూహెచ్, ఎల్లుండి నుంచి ఓయూ చివరి సెమిస్టర్ పరీక్షలు యాథావిథిగా జరుగుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement