- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇల్లు కొంటానంటూ వచ్చి తుపాకీతో బెదిరించి…
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో హైటెక్ చోరీ జరిగింది. గుడివాడ కాకతీయనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఇల్లు కొనుగోలు చేస్తానని తిరుగుతూ ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేశాడు. తుపాకీతో బెదిరించి ఆమె మెడలో ఉన్న 9తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. కాలనీ వాసులు వెంబడించే ప్రయత్నం చేసినా తుపాకీ చూపించడంతో ప్రజలు భయపడిపోయారు. వెంటనే స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story