టాలీవుడ్‌లో‌ మరో మల్టీస్టారర్.. క్రేజీ కాంబినేషన్!

by Shyam |   ( Updated:2021-01-25 03:58:45.0  )
టాలీవుడ్‌లో‌ మరో మల్టీస్టారర్.. క్రేజీ కాంబినేషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే రియల్ లైఫ్‌లో మంచి బాండింగ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్స్ త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ చిత్రాల దర్శకులు మహేష్ వి.రాఘవ్ ఇందుకోసం స్క్రిప్ట్ సిద్ధం చేయగా దాదాపు ఓకే అయిందని సమాచారం. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్2 బ్యానర్స్‌పై అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ‘లైగర్’ సినిమాతో విజయ్, ‘పుష్ప’తో బన్నీ బిజీగా ఉండగా.. ప్రాజెక్ట్‌లు పూర్తి కాగానే 2021 చివర్లో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Advertisement

Next Story