తల్లినవుతా అంటున్న హీరోయిన్

సౌత్‌లో తన నట జీవితం ప్రారంభించి, బాలీవుడ్‌లో అవకాశాలు చేజిక్కించుకుని, ప్రస్తుతం హాలీవుడ్‌లో రాణిస్తూ గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతోంది ప్రియాంక చోప్రా. నటనలోనే కాదు.. సింగర్‌గానూ తన టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించింది ఈ బ్యూటీ. అయితే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ.. అమెరికన్ పాప్ గాయకుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. పెళ్లయ్యాక ప్రతి మహిళ కోరుకునేది అమ్మతనం. తాజాగా ప్రియాంక ఈ విషయం గురించి పెదవి విప్పింది. తానెప్పుడూ తల్లి కావాలనుకుంటుందో వివరించింది.

నిక్‌ను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయమని ఎప్పుడూ చెప్పే ప్రియాంక.. నిక్‌తో తాను చాలా సంతోషంగా ఉంటున్నానని తెలిపింది. ‘ఇంతకుముందు నాకు తల్లిదండ్రులు తప్ప వేరే ప్రపంచం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు రోజూ నిద్ర లేవగానే.. నాకంటూ ఓ ఇళ్లు ఉందని, నాకంటూ ఓ సొంత మనిషి ఉన్నాడని, ఇది నా కుటుంబం అని తన మనసుకు అనిపిస్తోందని, ఈ భావన ఎంతో సంతోషంగా ఉందని’ ప్రియాంక చెప్పుకొచ్చింది. అంతేకాదు, 12 ఏళ్ల వయసు నుంచి అమ్మతనం గురించి ఆలోచించేదాన్నని ఈ బ్యూటీ చెబుతోంది. ‘పిల్లలంటే చాలా ఇష్టం. నాకు పిల్లలు కావాలని ఉంది. పిల్లల్ని కనే విషయంలో మాకంటూ ఓ క్లారిటీ ఉంది. తప్పకుండా తల్లిని అవుతాను’ అని తెలిపింది.

Advertisement