సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘జాంబీ రెడ్డి’ హీరోయిన్

by Shyam |
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘జాంబీ రెడ్డి’ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ ఆనంది తెలుగమ్మాయే అయినా, టాలీవుడ్‌ కన్నా కోలీవుడ్‌లోనే ఎక్కువగా రాణించింది. మారుతి డైరెక్షన్‌లో 2012లో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమాతో టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇచ్చిన ఆనంది.. ఆ తర్వాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి బెస్ట్ యాక్ట్రెస్ అనిపించుకుంది. తెలుగు, తమిళ్ కలిపి మొత్తంగా 25కు పైనే సినిమాలు చేసిన హీరోయిన్.. తాజాగా ‘జాంబీ రెడ్డి’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కెరియర్‌‌ను సక్సెస్‌ఫుల్‌‌గా లీడ్ చేస్తున్న ఆనంది.. ఉన్నట్టుండి పెళ్లి కూతురు అయిపోయింది. వరంగల్‌కు చెందిన ఈ భామ.. సిటీలోని ఓ హోటల్‌లో మ్యారేజ్ చేసుకుంది. ఈ వివాహ మహోత్సవానికి సమీప బంధువులు, మిత్రులు మాత్రమే హాజరు కాగా సోక్రటిస్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా.. ఇంత సడెన్‌గా, సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకుందనేది డౌట్.

Advertisement

Next Story