రెండో పెళ్ళికి సిద్దమైన అక్కినేని హీరో.. అమ్మాయి ఎవరంటే..?

by Shyam |   ( Updated:2021-07-28 02:39:39.0  )
రెండో పెళ్ళికి సిద్దమైన అక్కినేని హీరో.. అమ్మాయి ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేమకథ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుమంత్ 2004 లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వ్యక్తిగత విభేదాల వలన వారిద్దరూ 2006 లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి సింగిల్ గానే ఉంటున్న సుమంత్ ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారు.

ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనునట్లు సమాచారం. ఇక సుమంత్ వెడ్స్ పవిత్ర కి సంబంధించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పెళ్లి తేదీ ఎప్పుడు అనేది తెలియదు కానీ, త్వరలోనే అతికొద్దిమంది సభ్యుల మధ్య ఈ పెళ్లి జరగనుందట. అయితే ఈ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఇది నిజమా..? లేక పుకారా..? అని అభిమానులు అనుమానిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు.

ప్రొఫెసర్ దారుణం.. సీఎం జగన్ ఇలాకాలో సంచలన ఘటన

వరుణ్ తేజ్ కోసం తమన్నా స్పెషల్ నంబర్

Advertisement

Next Story

Most Viewed