- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ అంటే ఇష్టం : సుమన్
by Shyam |

X
రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని సినీ హీరో సుమన్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఇవాళ ఆయన హైదరాబాద్ నుంచి కోదాడకు వెళ్తూ మార్గంమధ్యలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని వివేరా హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనంటే ఎనలేని అభిమానమని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ సేవలు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నాలుగు కొత్త చిత్రాల్లో నటిస్తున్నానని అవి విడుదల కానున్నాయని, వాటిని ఆదరించాలని అభిమానులను కోరారు.
Next Story