సిద్దిపేట జిల్లాలో హీరో శ్రీకాంత్ సందడి

by Shyam |
సిద్దిపేట జిల్లాలో హీరో శ్రీకాంత్ సందడి
X

దిశ, సిద్దిపేట: జిల్లాలో హీరో శ్రీకాంత్ సందడి చేశారు. మిరుదొడ్డి మోతే గ్రామంలోని లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరంతో పాటు మాస్కులు ధరించాలని సూచించారు. ఇక్కడి ప్రాంతంలో వైరస్ ఉధృతి లేకపోవడం శుభపరిణామం అన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త భాస్కరరావుతో ముచ్చటించారు. మోతే గ్రామానికి వచ్చిన హీరో శ్రీకాంత్‌ను స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ సత్కరించారు. హీరో శ్రీకాంత్ గ్రామానికి వచ్చిన విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చూడడానికి తరలివచ్చారు.

Advertisement

Next Story