- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్.. మూడోసారి డబుల్ రోల్..!
దిశ, వెబ్ డెస్క్: బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్, ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయర్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. కాగా ప్రభాస్ ఇప్పటికే బాహుబలి, బిల్లా సినిమాల్లో డ్యూయర్ రోల్‌లో నటించి అందరినీ అలరించారు.