- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నితిన్ త్రిపాత్రాభినయం.. రంగంలోకి ‘83’ మేకప్ ఆర్టిస్ట్
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నితిన్ ‘భీష్మ’తో సక్సెస్ అందుకున్నారు. కొవిడ్ రాకకు ముందే గతేడాది రిలీజైన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. కాగా, నితిన్ తొలిసారిగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి ‘పవర్‌పేట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఇందులో నితిన్ 20 ఏళ్లు, మధ్యవయస్కుడు, 60 ఏళ్ల వ్యక్తి పాత్రల్లో కనిపించనున్నాడు.
ఈ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ కృష్ణచైతన్య బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌ను రంగంలోకి దించుతున్నాడట. ‘83’ చిత్రంలో ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ను కపిల్‌దేవ్‌గా మేకప్ డిజైన్ చేసింది రషీదే. రషీద్ ఇటీవల నితిన్‌కు లుక్ టెస్ట్ కూడా చేయగా..మంచి ఫలితాలు కనిపించాయట. నితిన్-కృష్ణచైతన్య అండ్ టీం వేసవి తర్వాత షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం ‘రంగ్‌దే’ ‘చెక్’ ‘అంధాధున్’ రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ‘రంగ్‌దే’ త్వరలో రిలీజ్ కానుంది.