టక్ ‘జగదీష్ నాయుడు’ ఫస్ట్ లుక్..

by Shyam |
టక్ ‘జగదీష్ నాయుడు’ ఫస్ట్ లుక్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కొవిడ్ టైంలో ఆయన నటించిన ‘వి’ సినిమా ఓటీటీల్లో రిలీజ్ ప్రేక్షకులను అలరించింది. కాగా, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 1 నుంచి ‘వి’ చిత్రాన్ని టాకీసుల్లో రిలీజ్ చేయనున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చిత్రం చేస్తుండగా..ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని మూవీ యూనిట్ క్రిస్మస్ కానుక‌గా విడుద‌ల చేసింది. ఇందులో చాలా డీసెంట్‌గా టక్ వేసుకొని అన్నం ముందు కూర్చున్న నాని వెనుక నుంచి క‌త్తి తీసే స్టిల్ ఆకట్టుకుంటోంది. ‘‘ఈ సారి ఫుల్ మీల్స్..అంటూ’’ ట్విట్టర్ వేదికగా హీరో నాని ఫస్ట్ లుక్ ఫొటో పెట్టి ట్వీట్ చేశాడు. ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తుండగా..నాని జగదీష్ నాయుడు పాత్ర పోషిస్తుండగా..రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహుగార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

https://twitter.com/NameisNani/status/1342329050468007937?s=20

Advertisement

Next Story

Most Viewed