- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హార్లె-డెవిడ్‌సన్ రెట్రో బైకులను తీసుకురానున్న హీరో మోటోకార్ప్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రీమియం మోటర్‌సైకిల్ విభాగంలో రెట్రో స్టైలింగ్‌లో హార్లె-డెవిడ్‌సన్ మోడల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అమెరికా లగ్జరీ బైక్ సంస్థ హార్లె-డెవిడ్‌సన్ గతేడాది భారత్‌లో తయారీ, అమ్మకాల కార్యకలాపాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయంగా అమ్మకాలను నిర్వహించేందుకు హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హీరో సంస్థ రెట్రో విభాగంలో కొత్త బైకులను తీసుకురానున్నట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఈ విభాగంలోని బైకులు మొత్తం ప్రీమియంలో దాదాపు మూడింట ఒక వంతు లాభాలను కలిగి ఉందని, హార్లె-డెవిడ్‌సన్‌తో ఒప్పందంలో భాగంగా ఈ బైకులను లాంచ్ చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రీమియం బైక్ విభాగంలో తమ ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు వీలవుతుందని హీరో మోటోకార్ప్ సంస్థ భావిస్తోంది. రానున్న రోజుల్లో ఈ విభాగంలో మెరుగైన ఇంజిన్ సామర్థ్యంతో బైకులను మార్కెట్లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ప్రీమియం బైకుల విభాగంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్లను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించింది. 2022, మార్చి నాటికి కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఉత్పత్తి చేపట్టనున్నట్టు నిరంజన్ గుప్తా తెలిపారు. గొగొరో కంపెనీ భాగస్వామ్యంతో ఈ మొదటి ఈ-బైక్ వచ్చే ఏడాది చివర్లో మార్కెట్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.