- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐసోలేషన్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆందోళనలో ఫ్యాన్స్

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి తో దేశం అట్టుడిగిపోతుంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఎవ్వరిని కరోనా వదలడం లేదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తుంది. ఇప్పటీకే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మరికొంతమంది ప్రముఖులు వారి సన్నిహితులకు కరోనా రావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవలే ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్‌కు కరోనా రావడంతో ప్రభాస్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. రామ్ చరణ్ , తారక్ సైతం ఇంటికే పరిమితమయ్యారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. మహేష్ పర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆయన ఐసోలేషన్ కి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ‘సర్కార్ వారి పాట’ షూటింగ్ వాయిదా పడింది. మే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభమవనుంది.
Next Story