- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 గంటల్లో 1000 పుష్‌అప్స్.. లూకాస్ రికార్డ్ ఫీట్
దిశ, ఫీచర్స్ : యూట్యూబ్‌లో ‘పుష్‌అప్’ అనే పదాన్ని టైప్ చేస్తే చాలు.. ఇటీవల కొన్ని గంటల వ్యవధిలో 1,000 పుష్‌అప్స్ చేసిన క్రాస్‌ఫిట్టర్ క్రెయిగ్ రిచీ వీడియో ప్రత్యక్షమవుతుంది. లేదంటే 300 పుష్‌అప్స్ ప్రదర్శించిన ఇవాన్ జాంగ్ వంటి ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు చెందిన వందల వీడియోలు మీకు స్వాగతం పలుకుతాయి. ఈ నేపథ్యంలోనే మిలియన్ పుష్‌అప్స్ పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఫిట్‌నెస్ ఫ్రీకర్స్ కూడా ఉండగా.. సగటు వ్యక్తి విషయానికొస్తే 10 పుష్‌అప్స్ తీయడానికి కూడా కష్టపడుతుంటారు. కాగా సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు ఆపకుండా 10 పుష్‌అప్స్ చేయలేరని, మూడో వంతు కంటే ఎక్కువ మంది కనీసం 5 పుష్‌అప్స్ కూడా సరిగా చేయలేరని తాజా అధ్యయనంలో సూచిస్తోంది. యూట్యూబర్ లూకాస్ కేవలం 24 గంటల వ్యవధిలో 1000 పుషప్స్ చేయాలనే లక్ష్యంతో ప్రయత్నించి ఫలితం సాధించాడు.
లుకాస్ ప్రతీరోజు 100 పుష్‌అప్స్, 50 పుల్‌అప్స్ చేస్తుండేవాడు. కానీ తనకు తానుగా సవాల్ స్వీకరించి 1,000 పుష్‌అప్ రెప్స్‌ను ఒకేసారి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. అనుకున్నట్లుగానే కేవలం 12 గంటల్లో మొత్తం 1,000 రెప్స్ పూర్తి చేసి సత్తాచాటాడు. నిజానికి ఒకేసారి పదుల సంఖ్యలో రెప్స్ చేయాలంటే కష్టమైన పనే. పదేపదే కండరాల సంకోచాలు శరీరంలో వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిలోని లాక్టిక్ యాసిడ్, వివిధ ఫాస్ఫేట్లు కండరాల కణజాలంలో పేరుకుపోతాయి. ఇవి పుష్‌అప్స్ చేస్తుంటే తీవ్రమైన మంట పుట్టిస్తాయి. అస్థిపంజర కండరాలు లాక్టేట్‌తో నిండినందున ప్రతి క్లస్టర్ రెప్స్ మరింత కష్టతరం అవుతాయి.
‘ప్రతీ గంటకు 100 పుష్‌అప్స్ చేస్తే అనుకున్న లక్ష్యాన్ని 10 గంటల్లో పూర్తి చేయగలను. కానీ చేయగలుగుతానో లేదో అనే డౌట్ ఉండేది. అయితే ఫస్ట్ 100 రెప్స్ గొప్పగా అనిపించాయి. ఆ తర్వాత హాఫ్‌వే పాయింట్‌కు(500వ రెప్ పూర్తిచేసినప్పుడు) చేరుకున్నప్పుడు ట్రైసెప్స్‌లో నొప్పి పెరిగింది. వాస్తవానికి అనుకున్నదానికంటే చాలా కష్టంగా మారింది. ఇంకా 300 మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఒక్కో సెట్ ఎక్కువ సమయం తీసుకుంటుందని నాకర్థమైంది. దీంతో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నిర్ధేశించుకున్న 10 గంటల లక్ష్యం అవాస్తవంగా అనిపించింది. కానీ 8 గంటల్లోనే వెయ్యి మార్క్‌ను చేరుకోవడం సంతోషాన్నిచ్చింది.
– లూకాస్