ప్రత్యామ్నాయ పంటలపై సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్

by Sridhar Babu |   ( Updated:2021-11-28 03:27:24.0  )
Shiva-LIngaiah1
X

దిశ, జనగామ: జిల్లాలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్ నెంబర్ 7288894712 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి హెల్ప్ లైన్ నెంబర్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేరుశనగ, పొద్దుతిరుగుడు, పల్లి, నువ్వులు తదితర పన్నెండు రకాల పంటల గురించి సలహాలు, సూచనలు తెలుసుకోవచ్చన్నారు. ఈ పంటల సాగుతో ఎంత లాభం వస్తుందో, ఏ భూమి మీద ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో, పంటల విత్తనాలు, ఎరువులు ఎలాంటి సందేహాలున్నా ఫోన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని ఆయన అన్నారు. వచ్చే యాసంగి సీజన్ లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రతి రైతుకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులు హెల్ప్ లైన్ నెంబర్ ను సద్వినియోగం చేసుకొని లాభసాటి పంటలు సాగుచేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed