పల్లెటూరి అమ్మాయిగా ‘హెబ్బా’ న్యూ లుక్!

by  |
పల్లెటూరి అమ్మాయిగా ‘హెబ్బా’ న్యూ లుక్!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లామరస్ గర్ల్ హెబ్బా పటేల్.. విలేజ్ గర్ల్‌గా మారిపోయింది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా కనిపించబోతున్న హెబ్బా.. మేకప్ లేకుండా పల్లెటూరి అమ్మాయిగా పూర్తి ట్రెడిషనల్ లుక్‌లో ప్రత్యక్షమైంది. ఓదెల అనే గ్రామంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఇంటెన్స్ లవ్ స్టోరీలో హెబ్బా క్యారెక్టర్ హైలెట్ కానుండగా.. కన్నడ యాక్టర్ సింహ హీరోగా నటిస్తున్నారు.

డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘కుమారి 21ఎఫ్’ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న హెబ్బా పటేల్.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని అనుకున్నా.. ఆ తర్వాత తను ఎంచుకున్న సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోవడంతో ఆమె కెరియర్ డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా ద్వారా అయినా తన కెరియర్‌లో మార్పు కనిపిస్తుందేమో చూడాలంటున్నారు విశ్లేషకులు.

శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేశ్, భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్డే ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ విలేజ్ లవ్ స్టోరికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story