హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎందుకో తెలుసా.?

by Shyam |
హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎందుకో తెలుసా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబర్ టవర్స్ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్లో గా మూవ్ అవుతోంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మెగా వ్యాక్సినేషన్ ఉన్న కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం 40వేల మందికి వ్యా్క్సినేషన్ చేయనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలు అక్కడకు చేరుకుంటున్నాయి. సండే కావటంతో వ్యాక్సినేషన్ కోసం ప్రజలు క్యూ కట్టారు. ఈ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisement

Next Story

Most Viewed