- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రగతి భవన్ ముట్టడిలో ఉద్రిక్తత.. బారికేడ్లు దూకిన విద్యార్ధి సంఘాల నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులు తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఒకేసారిగా విద్యార్థి నాయకులు దూసుకు రావడంతో టెన్షన్ పరిస్థితి నెలకొంది. విద్యార్థి నాయకులు ప్రగతి భవన్ వద్ద భారీకేడ్లను దూకేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే వరకూ తాము ఉద్యమిస్తామని వారు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. భారీకేడ్లు ఎక్కి నిరసన తెలపడంతో ప్రగతి భవన్ ముట్టడి సక్సెస్ అయిందని వారు ప్రకటించారు. ప్రగతి భవన్ ముట్టడిలో పీవైఎల్ సభ్యులు మరో గ్రూప్‌గా రానునట్టు పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముట్టడి కార్యక్రమంలో 25 నుంచి 30 మంది PDSU విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. మరో గ్రూప్ వచ్చే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం కారణంగా పంజాగుట్ట నుంచి బేగంపేట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.