నగరంలో పలుచోట్ల వర్షం

by Anukaran |   ( Updated:2020-10-20 21:02:38.0  )
నగరంలో పలుచోట్ల వర్షం
X

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్‌బీనగర్‌‎లో కుండపోత వాన పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్, మలక్‌పేట, కోఠీ, అమీర్‎పేట, సనత్‎నగర్, కూకట్‎పల్లిలో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందన్న అధికారుల హెచ్చరికలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దాదాపు 200 కాలనీల్లోని ప్రజలు వరద నీరు చుట్టుముట్టడంతో బయటకు అడుగుపెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు.. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చెరువుల సమీపాల్లో నివసించే వారు తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరుతున్నారు.

Advertisement

Next Story