ముంబైలో కుంభవృష్టి

by  |
ముంబైలో కుంభవృష్టి
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబై జడివానకు తడిసి ముద్దయింది. గత పదిహేనేళ్ల తరువాత అంతటి భారీ వర్షం కురిసిందని వాతావారణ అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసింది. కేవలం నాలుగు గంటల్లో 198 మి‌మీ వర్షపాతం నమోదయింది.

మొత్తంగా ఒక రోజు వ్యవధిలో 230 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని రకాల కార్యకలాపాలు బంద్ అయ్యాయి. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. తన జీవితంలో ఇంతటి భారీ వర్షం చూడలేదని వ్యాఖ్యానించడం వర్షం ఏస్థాయిలో విరుచుకుపడిందో అర్థం చేసుకోవచ్చు.


Next Story