- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో డీజీపీ ఆఫీస్‌లో లాండ్ ఆర్డర్ ఏఐజీగా అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, విజయవాడ రైల్వేస్ ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా అజిత వేజెండ్ల, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా జీఎస్ సునీల్, విశాఖ డీసీపీ-1గా గౌతమి శాలి , ఇంటెలిజెన్స్ సీఎం ఎస్‌జీ ఎస్పీగా వకుల్ జిందాల్‌లు బదిలీ అయ్యారు. అలాగే రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి , విజిలెన్స్&ఎన్‌ఫోర్స్‌మెంట్ (జనరల్ అడ్మిన్) ఎస్పీగా డా.షీమోషి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయా ప్రవీణ్ బదిలీ అయ్యారు. కోయ ప్రవీణ్‌కు పీటీవోగా అదనపు బాధ్యతలను సైతం అప్పగించింది ప్రభుత్వం. మరోవైపు విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ఇకపోతే నారాయణ్ నాయక్‌కు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.