మృతదేహం పక్కన భారీగా బంగారం, డబ్బు

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ఓ ఘటనలో రెండు సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఒక విషాదమైతే మరొకటి ఆశ్చర్యకం. అదేమిటంటే.. తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళ మృతిచెందింది. అయితే, కరోనా భయంతో ఆ మహిళ అంత్యక్రియలకు స్థానికులెవరూ సహకరించలేదు. దీంతో ఆ మహిళ మృతదేహంతో అక్కాచెల్లెళ్లు 45 రోజులుగా గోడౌన్ లో ఉన్నారు.

దీంతో ఆ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని ఆ మృతదేహాన్ని తరలించారు. ఈ సమయంలో గోడౌన్ లో భారీగా బంగారం, నగదు బయటపడింది. ఇది చూసిన పోలీసులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది స్వాధీనం చేసుకుని ఈ బంగారం, నగదు ఎక్కడిది.. ఇక్కడకు ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Advertisement