- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dragon fruits: డ్రాగన్ ఫ్రూట్స్‌ను తినకుండా పక్కన పెట్టేస్తున్నారా.. దాని వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే షాక్!
దిశ, ఫీచర్స్: డ్రాగన్ ఫ్రూట్ గత కొద్ది రోజుల నుంచి మార్కెట్లో విరివిగా దొరుతున్నాయి. పిటాయ అని పిలవబడే ఈ పండ్లు మూడు కలర్స్ పసుపు, పింక్, తెలుపు రంగుల్లో ఉండి జనాలను ఆకట్టుకుంటున్నాయి. అయితే దీనిని ఇండియాలోనూ మిద్దెపై పండిస్తూ చిన్న పెద్ద డ్రాగన్ ఫ్రూట్స్ తింటున్నారు. అలాగే వీటితో ఐస్‌క్రీం, కేకులు, సలాడ్స్, కేకులు వంటివి రెడీ చేసుకుని ఆరోగ్యానికి మంచివని తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే డ్రాగన్ ఫ్రూట్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఉండి ఆరోగ్యానికి పలు రకాల లాభాలను కలిగిస్తాయి. కానీ కొందరు ఈ పండును తినడానికి ఇష్టపడకుండా పక్కన పెట్టేస్తున్నారు. దానికి కారణం టేస్ట్ నచ్చకనో లేదా.. అధిక రేట్లు ఉండటంతో కొనేందుకు ఆలోచిస్తున్నారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఆరోగ్యానికి పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.
*ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని అడ్డుకుంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. కాబట్టి డ్రాగన్స్ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
* డ్రాగన్ ఫ్రూట్స్‌లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
*ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి అద్భుతంగా పని చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంతో పాటుగా రక్తపోటును నియంత్రించడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది.
*డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీట్యూమర్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ లక్షణాలు మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఈ పండ్లను తీసుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది.
*ఇటీవల కాలంలో చాలా మందికి ఆక్సీకరణ, ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దీంతో అల్జీమర్స్, పార్కిన్సన్స్, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
*అలాగే బరువు పెరిగిన వారు ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ తగ్గడం లేదని బాధ పడుతున్నారు. అలాంటి వారికి డ్రాగన్ ఫ్రూట్ మేలైన ఎంపిక. దీనిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా నాజుకుగా తయారవుతారు. అలాగే ఎముకల ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించాము.