మీ గుండె దడగా అనిపిస్తుందా.. అయితే జాగ్రత్త

by samatah |
మీ గుండె దడగా అనిపిస్తుందా.. అయితే జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో ప్రజలందరూ ఆందోళన చెందుతూ.. గుండె దడకు గురి అవుతున్నారు. అయితే ఇలా గుండెల దడగా అనిపించడానికి హాలిడే హార్ట్ సిండ్రోమ్ కారణం అంట.

అయితే హృదయ స్పందనలు లయ తప్పడం, ఎవరైనా ఒక వ్యక్తికి ఇదివరకు ఎలాంటి గుండె జబ్బులు లేకపోయినా, గుండెలో దడగా అనిపిస్తే, ఛాతీలో అసౌర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటే దానిని హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి మితి మీరిన అల్కహాల్ తీసుకోవడం, రక్త ప్రసరణలో అడ్డంకులే కారణమంట.

గుండె దడగా అనిపించినప్పుడు. ఎక్కువగా అలిసిపోవడం, ఛాతిలో ఏదో అలజడి, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయంట. అందువలన ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా కూల్‌గా ఉండాలంట. ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదంట.పుస్తకం చదవడం, ఇష్టమైన సినిమా చూడటం లాంటివి చేయాలంట.ప్రస్తుతం గుండెపోటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మీ హృదయాన్ని మీరు పదిలంగా ఉంచుకోవాలంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story

Most Viewed