Ginger : వర్షాకాలంలో అల్లం తినడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Jakkula Samataha |
Ginger : వర్షాకాలంలో అల్లం తినడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వంటల్లో కానీ, ఉదయం అల్లంతో చేసిన టీ కానీ తాగాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో తప్పకుండా వర్షాకాలంలో అల్లం తీసుకోవాలంట. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కాగా, అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షకాలంలో చాలా మంది అనారోగ్య సమస్యల పాలవుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాగా అలాంటి సమస్యలతో బాధ పడేవారు తప్పకుండా రోజూ ఉదయం అల్లం టీ తాగాలంట. దీని వలన ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అదే విధంగా వాంతులు అవుతున్నా, మైగ్రేన్, తల నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కొంత మంది మహిళలు రుతుస్రావం సమయంలో కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజూ అల్లం తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా వర్షాకాలంలో ప్రతి రోజూ అల్లం తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

Advertisement

Next Story

Most Viewed