Health: మీకు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుందా? పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే!

by D.Reddy |
Health: మీకు ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుందా? పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే!
X

దిశ, వెబ్ డెస్క్: మనుషులకు కోపం రావటం అనేది సర్వ సాధారణం. అయితే, కొంత మంది మాత్రం ప్రతి చిన్న విషయానికి కోపడుతుంటారు. ఇలా అతిగా కోపం రావటం అనేక అనర్థాలకు దారి తీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటున్నారు. అందుకే, మన పెద్దలు కూడా 'తన కోపమే తన శత్రువు' అని చెబుతారు. ఈ నేపథ్యంలో మనకు వచ్చే రెండు నిమిషాల కోపం ఎన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు

మనకు కోపం వచ్చినప్పుడల్లా శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు అడ్రినలిన్, కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. కోపం తగ్గిపోయినా అవి బ్లడ్‌లోనే 4 నుంచి 5 పాటు అలాగే ఉంటాయి. దీనివల్ల 6 గంటల పాటు మీ ఇమ్యూనిటీ సిస్టం దెబ్బతింటుంది. దీని కారణంగా రక్తంలో చక్కర స్థాయిలు పడిపోవటం, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే, తీవ్రమైన ఒత్తిడిని కలిగించి గుండెపోటుకు కారణమవుతాయి, రక్తపోటును పెంచుతాయి, పక్షవాతం వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు, కేవలం రెండు నిమిషాల కోపం 8 గంటల వరకు చర్మంపై ప్రభావం చూపిస్తుంది. అంటే చర్మం పనితీరు దెబ్బతిని భవిష్యత్తులో మొటిమలు, దద్దుర్లు, వంటి అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. దీంతో చిన్న వయసులోనే ముడతలు ఏర్పడుతాయి. కోపం వల్ల జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది.

కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే?

అంతేకాదు, కోపం మనిషిని మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. అందుకే వీలైనంతా వరకు కోపాన్ని తగ్గించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్కబెడితే నెమ్మదిగా కోపం పొతుందని నిపుణులు సూచిస్తున్నారు అలాగే, నిత్యం యోగా, ధాన్యం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా కోపం కంట్రోల్ అవుతుంది. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ కోపం పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తే, వేగంగా నడవటం, పరుగెత్తటం, ఇతర ఆనందదాయకమైన శారీరక కార్యకలాపాలు చేస్తే కూడా కోపం తగ్గిపోతుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.



Next Story